జయేంద్రఅరెస్టును రాజకీయం చేయం:వెంకయ్య
విశాఖపట్నం:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి అరెస్టును రాజకీయం చేసేఆలోచన తమకు లేదని భారతీయజనతా పార్టీ (బిజెపి) మాజీజాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.కంచి స్వామి పోలీసు కస్టడీకి నిరసనగాబిజెపి చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్నిఆయన ఆదివారం సందర్శించారు.
హిందువులమనోభావాలను దెబ్బ తీస్తే మాత్రంసహించబోమని ఆయన చెప్పారు. కొన్నిపార్టీలు మైనారిటీలను బుజ్జగిస్తూ హిందువులహక్కులను కాలరాస్తున్నాయని ఆయనవిమర్శించారు. హిందువులు కూడా ఈదేశం పౌరులేనని, వారికిహక్కులున్నాయని తాము చెబుతున్నామని,వారి హక్కుల కోసం తాము పోరాడుతామనిఆయన చెప్పారు.జయేంద్రసరస్వతి అరెస్టు జరగకపోతే తాము ఈవిషయం గురించి మాట్లాడేవారమే కాదని,తాము శంకర మఠానికి వెళ్లాలని గానీహిందూ మతం తీసుకోవాలని గానీ తాముఅనడం లేదని ఆయన చెప్పారు.పౌరులందరికీ సమాన హక్కులు,గౌరవం ఉండాలని తాము అంటున్నామనిఆయన స్పష్టం చేశారు. ఆదిశంకరాచార్యులు ప్రారంభించిన కంచికామకోటి పీఠాన్ని అప్రదిష్ట పాలుచేస్తున్నారని ఆయన అన్నారు. జయేంద్రసరస్వతి విషయంలో చట్టం తన పనితాను చేసుకుని పోవాలని తాముఅంటున్నామని, అరెస్టు చేసి నేరమేదీరుజువు కాకముందే అపఖ్యాతి పాలుచేయడం సరి కాదని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications