మంత్రులతనిఖీ: జైలు అధికారుల నిర్వాకం
వరంగల్:మంత్రుల తనిఖీ సందర్భంగా ఖైదీలనుబంధించి వరంగల్ కేంద్రకారాగారం అధికారులు మరో వివాదానికితెర లేపారు. అధికారుల వేధింపులుభరించలేక ముగ్గురు ఖైదీలుఆత్మహత్యాయత్నానికి పాల్పడిననేపథ్యంలో ఆదివారంనాడు దేవాదాయ శాఖమంత్రి ఎం. సత్యనారాయణ రావు, భారీనీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలలక్ష్మయ్య జైలును తనిఖీ చేశారు.
జైలులోకివచ్చిన మంత్రులు కొంత మందిఖైదీలను కలుసుకున్నారు. తానుగతంలో జైలు జీవితం గడిపినప్పుడుఉన్న బ్యారెక్‌ను, అప్పటి చెట్లనుసందర్శించడంపైసత్యనారాయణరావు ఆసక్తిప్రదర్శించగా, చాలా రోజులు జైలులోఉన్నందున మానసిక దౌర్బల్యానికిగురై ఆత్మహత్యా యత్నానికిపాల్పడ్డారనే పద్ధతిలో లక్ష్మయ్యమాట్లాడారు. ఖైదీల పరిస్థితిపై వారు ఏమాత్రం ఆసక్తి చూపలేదు.
అయితేమీడియా ప్రతినిధులతో మాత్రం ఖైదీలుమాట్లాడారు. తమ ప్రాణాలకు హామీ ఇస్తే నిజాలుచెప్తామని కొందరు ఖైదీలు చెప్పారు.అధికారులు తమ రకరకాలుగావేధిస్తున్నారని ఖైదీలు తమ గోడునువెళ్లబోసుకున్నారు. వారి ఈతిబాధలనువినడానికి వారిని మంత్రుల వద్దకుమీడియా ప్రతినిధులు పట్టుకొచ్చారు.తమను వేరే జైలుకు పంపితమను కాపాడాలని కొందరు ఖైదీలుమంత్రుల కాళ్లపై పడివేడుకున్నారు. బోరుబోరునవిలపించారు.












Click it and Unblock the Notifications