మరోకేసులోనూ కంచిస్వామికి జ్యుడిష్యల్‌కస్టడీ
చెన్నై:రెండో కేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతిని జ్యుడిష్యల్ రిమాండ్‌చేస్తూ మెట్రోపాలిటన్ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో జయేంద్రనుడిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకుజ్యుడిష్యల్ కస్టడీకి పంపుతూఉత్తర్వులు జారీ అయ్యాయి.
కంచిపీఠం అనుయాయి జి. రాధాకృష్ణన్‌పైదాడికి పథకం పన్నారనే కేసులో కంచిస్వామికి ఇదివరకే పోలీసులు అరెస్టువారంట్ జారీ చేశారు. రెండు వేలరెండు సెప్టెంబర్ రాధాకృష్ణన్‌పైహత్యా ప్రయత్నం జరిగింది. కాంచీపురంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుకుభిన్నమైన ఈ కేసు విచారణ చెన్నైలోజరుగుతోంది. శంకరరామన్‌హత్య కేసులో పదిహేను రోజుల పాటుజయేంద్ర జ్యుడిష్యల్ రిమాండ్‌నుపొడిగిస్తూ కాంచీపురం కోర్టు ఆదేశాలు జారీచేసింది.











Click it and Unblock the Notifications