వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులపైనక్సల్స్‌కు జానారెడ్డి హితవు

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:కాల్పుల సంఘటనలు పునరావృతంకాకుండా జుగ్రత్తలు తీసుకోవాలని హోం మంత్రికె. జానారెడ్డి మావోయిస్టు నక్సల్స్‌కుసూచించారు. కరీంనగర్‌ జిల్లాలోగురువారం పోలీసులకు, నక్సల్స్‌కుమధ్య జరిగిన కాల్పులను దృష్టిలో పెట్టుకొనిఆయన విలేకరుల సమావేశంలో ఆసూచన చేశారు. అనంతపురంలోఆయన శుక్రవారం వివిధకార్యక్రమాల్లోపాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌జిల్లాలోనూ, ఇతర ప్రాంతాల్లోనూనక్సల్స్‌ దాడులుదురదృష్టకరమని ఆయన అన్నారు.ఇటువంటి సంఘటలు జరగకుండాచూసుకోవాలని ఆయన నక్సలైట్లకుసూచించారు. నక్సల్స్‌తో రెండో విడతచర్చలు యధావిధిగా జరుగుతాయనిఆయన చెప్పారు. పోలీసులకు,నక్సల్స్‌కు మధ్య నెలకొన్నఘర్షణ వైఖరి చర్చలకు అడ్డంకి కాదనిఆయన అన్నారు. అయితే అటువంటిసంఘటనలు పునరావృతం కాకుండాఇరు పక్షాలు పునఃసమీక్ష చేసుకోవాలనిఆయన అన్నారు. ఎవరి పరిమితులను వారుఅర్థం చేసుకొని సరైన అవగాహనతోచర్చలకు ముందుకు రావాలని ఆయనఅన్నారు.తుపాకులతోనక్సల్స్‌ గ్రామాల్లోసంచరించకూడదని ఆయన మరోసారివిజ్ఞప్తి చేశారు. నక్సల్స్‌తోతుపాకులతో సంచరిస్తూ పోలీసుల కంటపడితే కాల్పులు జరిగే ప్రమాదం ఉన్నదని,దీన్ని ఆసరాగా చేసుకొని మాఫియా ముఠాలుఆయుధాలతో రావచ్చునని తాను అనేకసార్లు చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు.రాయలసీమలోఫాక్షనిజాన్ని అంతం చేస్తామని జానారెడ్డిచెప్పారు. ఇందుకు అనుభవజ్ఞులైనపోలీసు అధికారులతో ఒక దర్యాప్తుబృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు. రాయసీమలోనిముఠాకక్షలను, ముఖ్యంగాఅనంతపురం జిల్లాలోని హత్యాకాండనుపరిగణనలోకి తీసుకుని ఈ చర్యలుతీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X