జయేంద్రపైగౌరవంతో వ్యవహరిస్తున్నాం: జయ
చెన్నై:జ్యుడిష్యల్ రిమాండ్‌లో ఉన్న కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిపట్ల అత్యున్నత గౌరవంతోవ్యవహరిస్తున్నామని తమిళనాడుముఖ్యమంత్రి జయలలిత చెప్పారు.మతపరమైన ఔన్నత్యాన్ని,సమాజంలోని హోదాను దృష్టిలో వుంచుకొనిజయేంద్ర సరస్వతి పట్లవ్యవహరిస్తున్నట్లు ఆమె శుక్రవారంతెలిపారు.
కంచిస్వామికి ఆరోగ్యపరంగా ఏ విధమైనఇబ్బందులు కలుగకుండా చూడాలని ప్రధానిడాక్టర్ మన్మోహన్ సింగ్ రాసినలేఖకు సమాధానంగా ఆమె ఆ విషయంచెప్పారు. వయస్సును, ఆరోగ్య పరిస్థితినిదృష్టిలో ఉంచుకొని జయేంద్రకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా అన్నిజాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు ఆమెతెలిపారు.వైద్యులబృందం జయేంద్ర సరస్వతి ఆరోగ్యపరిస్థితిని పర్యవేక్షించిందని, జయేంద్రఆరోగ్యం పట్ల వైద్యుల బృందంసంతృప్తి వ్యక్తం చేసిందని ఆమెచెప్పారు. కంచి స్వామి ఆరోగ్య పరిస్థితిపైరాష్ట్ర ప్రభ్వుం అన్ని జాగ్రత్తలుతీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.శంకరమఠానికిఅత్యంత సన్నిహితుడైనరాధాకృష్ణన్‌పై జరిగిన దాడి కేసుపైపోలీసులు చేసిన దర్యాప్తు ఫలితాలఆధారంగా ఈ కేసులో కూడా జయేంద్రసరస్వతిని అరెస్టు చేశారని ఆమెచెప్పారు. కేసును కచ్చితంగానిర్ధారణించుకోవడానికి ప్రత్యేకదర్యాప్తు బృందం ఎంతో జాగ్రత్తతో,జాగరూకతతో దర్యాప్తు చేసిందనిఆమె చెప్పారు.











Click it and Unblock the Notifications