జయేంద్రజ్యుడిష్యల్ రిమాండ్ పొడిగింపు
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిజ్యుడిష్యల్ రిమాండ్‌ను కాంచీపురంకోర్టు మరో పదిహేను రోజుల పాటు పొడిగించింది.వచ్చే నెల పదో తేదీ వరకు జయేంద్రసరస్వతి జ్యుడిష్యల్ రిమాండ్‌నుపొడిగిస్తూ కాంచీపురం కోర్టు శుక్రవారంఆదేశాలు జారీ చేసింది.
జయేంద్రసరస్వతి జ్యుడిష్యల్ రిమాండ్‌ను వచ్చేనెల పదో తేదీ వరకు పొడిగిస్తున్నట్లుకాంచీపురం ఫస్టు క్లాస్ జ్యుడిష్యల్‌మెజిస్ట్రేట్ జి. ఉత్తమరాజా ప్రకటించారు.జయేంద్ర సరస్వతి ఈ నెల పదకొండోతేదీన అరెస్టయ్యారు. కట్టుదిట్టమైనభద్రతా ఏర్పాట్ల మధ్య జయేంద్రసరస్వతిని శుక్రవారం ఉదయంపదకొండు గంటల పది నిమిషాలకు కోర్టులోహాజరు పరిచారు. పది నిమిషాల్లో కోర్టులోవ్యవహారం ముగిసింది.











Click it and Unblock the Notifications