కెసిఆర్‌కుశాఖ, తెలంగాణపై స్పష్టమైన హామీ
న్యూఢిల్లీ:ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌యస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావుకు మంత్రిత్వ శాఖకేటాయింపు జరిగే అవకాశం ఉంది.గురువారంనాడు అయనకు శాఖనుకేటాయించే అవకాశం ఉన్నట్లుతెలుస్తోంది.
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తన మంత్రివర్గాన్నిగురువారంనాడుపునర్వ్యస్థీకరించనున్నారు. ఈ స్థితిలోశుక్రవారం సాయంత్రం ప్రధానినికెసిఆర్ కలుసుకున్నారు. ప్రధానితోమాట్లాడిన అనంతరం ఆయననవ్వుకుంటూ బయటకు వచ్చారు.చంద్రశేఖర్ రావు ఇంతకాలంగా శాఖలేని మంత్రిగా కేంద్ర మంత్రివర్గంలోకొనసాగుతున్నారు. ఆయనకు బొగ్గుగనుల శాఖను అప్పగించనున్నట్లు మొదటప్రచారం జరిగింది. అయితే శిబూ సొరేన్‌నుమళ్లీ మంత్రివర్గంలోకి తీసుకొనిబొగ్గుగనుల శాఖను ఆయన వద్దేఉంచాలనే ఆలోచన చేస్తున్నట్లుసమాచారం. ఈ శాఖకు సహాయమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినదాసరి నారాయణరావు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. కెసి ఆర్‌కు పౌరసరఫరాల శాఖనుకేటాయించవచ్చుననే ప్రచారం కూడాజరిగింది. ఈ పరిస్థితుల్లో చంద్రశేఖర్‌రావుకు కార్మిక, పట్టణాభివృద్ధి,పరిశ్రమల శాఖల్లో ఏదో కేటాయించేఅవకాశాలున్నట్లు తెలుస్తోంది.తెలంగాణసమస్యపై తిరుగుబాటు చేయడానికికెసిఆర్ సిద్ధపడటంతో ఆయననుమన్మోహన్ సింగ్ పిలిపించారు. దాదాపుగంట సేపు చంద్రశేఖర్ రావుమన్మోహన్ సింగ్‌తో మాట్లాడారు.తమ కార్యకర్తల నుంచితెలంగాణపై ఒత్తిడి వస్తోందని కెసి ఆర్‌చెబుతూ దానిపై స్పష్టమైన హామీ ఇవ్వాలనిప్రధానిని కోరారు. దీంతో కెసి ఆర్‌కుమంత్రిత్వ శాఖ కేటాయింపుపై, తెలంగాణడిమాండ్‌పై మన్మోహన్ ఈ రాత్రికే ఒకప్రకటన చేస్తారని రాష్ట్రమంత్రి నాయనినర్సింహారెడ్డి ఢిల్లీలో చెప్పారు.











Click it and Unblock the Notifications