వైయస్‌ముఠా నాయకుడు: టిడిపి
వరంగల్:ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్‌రెడ్డి ముఠా నాయకుడిలావ్యవహరిస్తున్నారని తెలుగుదేశంపార్టీ నాయకుడు, భారీ నీటిపారుదల శాఖమాజీ మంత్రి కడియం శ్రీహరివ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల మాటలనుపెడచెవిన పెట్టడం రాజశేఖర్‌రెడ్డికిమంచిది కాదని ఆయన శుక్రవారంవిలేకరులతో అన్నారు.
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్ల కృష్ణా నదీ జలాల్లో మన రాష్ట్రంతన వాటాను కోల్పోయే ప్రమాదంఉన్నదని ఆయన అన్నారు.దుమ్ముగూడెం, పోలవరం మళ్లింపుపథకాలను చేపడితే మన రాష్ట్రంకృష్ణా నదీ జలాల్లో తన వాటానుకోల్పోతుందని ఆయన అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై న్యాయ నిపుణులనుసంప్రదించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికిసూచించారు. ప్రాజెక్టుల విషయంలోముఖ్యమంత్రి వైఖరి ప్రాంతీయ విభేదాలనురెచ్చగొట్టే విధంగా ఉన్నదని ఆయనఅన్నారు.నీటిపారుదల ప్రాజెక్టులపై రాష్ట్రప్రభుత్వానికి అవగాహన లేదని,రాష్ట్ర మంత్రులకు తమ తమశాఖలపై పట్టు లేకుండా పోయిందని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications