వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి బంద్‌:అరెస్టులు, ధ్వంసాలు, లాఠీచార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రైతు సమస్యలపై రాష్ట్ర భారతీయజనతా పార్టీ (బిజెపి) మంగళవారంతలపెట్టిన బంద్‌ అక్కడక్కడాహింసాత్మక సంఘటనలకు, లాఠీచార్జికి,బస్సుల ధ్వంసానికి దారి తీసింది. పలువురుబిజెపి నాయకులు అరెస్టయ్యారు.

బిజెపిరాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనారెడ్డి,తదితర నాయకులు కార్యకర్తలుఅకస్మాత్తుగా రాష్ట్ర సచివాలయం గేటువద్ద ప్రదర్శనకు దిగారు. దీంతోఅక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈసందర్భంగా ఇంద్రసేనానరెడ్డితో పాటుఅరవై ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. వారిని నాంపల్లి పోలీసు స్టేషన్‌లోవుంచారు. దీంతో బిజెపి కార్యకర్తలుపోలీసు స్టేషన్‌ ముందు ప్రదర్శననిర్వహించారుహైదరాబాద్‌లోనిచిక్కడపల్లి ప్రాంతంలో గల ఇ - సేవాకేంద్రంపై బిజెపి కార్యకర్తలు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. కుర్చీలను,కంప్యూటర్లను ధ్వంసం చేశారు.ఒక ఆపరేటర్‌పై చేయి చేసుకున్నారు.దీంతో హడలెత్తిన ఇ - సేవా సిబ్బంది ఒకగదిలోకి వెళ్లి తలుపులువేసుకున్నారు.నెల్లూరులోనిరైల్వే స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితినెలకొంది. రైళ్లను ఆపడానికి వెళ్తున్నబిజెపి కార్యకర్తలను పోలీసులుఅడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతోపోలీసులకు, బిజెపి కార్యకర్తలకుమధ్య తోపులాట జరిగింది.ఆందోళనకారుల్లోంచి ఒకరు రాయివిసరడంతో డియస్‌పి నర్సింహారెడ్డిగాయపడ్డారు. ఈ సమయంలో పోలీసులుస్వల్పంగా లాఠీచార్జి చేశారు.హైదరాబాద్‌లోపోలీసు సహాయంతో ఆర్టీసి బస్సులనునడిపించారు. దుకాణాల, వాణిజ్య సంస్థలుచాలా వరకు మూతపడ్డాయి.పాఠశాలలకు సెలవు ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా చూస్తే బంద్‌ మిశ్రమస్పందన లభించింది. బంద్‌కుప్రతిస్పందన బాగుందని రాష్ట్ర బిజెపిఅధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనా రెడ్డిచెప్పారు. దుకాణాలను పోలీసులు బెదిరించితెరిపించారని ఆయన విమర్శించారు.రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వంవిఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మందికి పైగాతమ కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేశారని బిజెపి జాతీయ కార్యదర్శిబండారు దత్తాత్రేయ చెప్పారు.బస్సులను, రైతులను తమకార్యకర్తలు ఆపేశారని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X