ప్రాజెక్టులపైఎంపీలతో వైయస్ సమావేశం
హైదరాబాద్:రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపైచర్చించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిమంగళవారంనాడు రాష్ట్రానికిచెందిన కాంగ్రెస్ పార్లమెంటుసభ్యులతో సమావేశమయ్యారు.అనుమతులు లేని కారణంగా పులిచింతలప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్‌లు వేసిననేపథ్యంలో ఈ సమావేశం జరిగిందనిభావిస్తున్నారు.
నీటిపారుదల ప్రాజెక్టులకు త్వరితగతనిఅనుమతులు ఇచ్చేలా, వాటికిఅవసరమైన నిధులనురాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపైఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి ఎంపిలనుకోరారు. రాష్ట్రానికి సంబంధించినఅంశాలపై చురుకుగా వ్యవహరించాలనిఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపైరాష్ట్ర ఆలోచనలను, ప్రస్తుత పరిస్థితినిరాజశేఖర్ రెడ్డి పార్లమెంటు సభ్యులకువివరించారు. కరవు సహాయక చర్యలకోసం ఎక్కువ నిధులు రాబట్టేందుకుకృషి చేయాలని ఆయన కోరారు.











Click it and Unblock the Notifications
