సంప్రదింపులవిధివిధానాలకే కమిటీ: జైరాంరమేష్
హైదరాబాద్:తెలంగాణపై వేసిన కమిటీ ఏకాభిప్రాయసాధన కోసం సంప్రదింపుల ప్రక్రియ ఎలాఉండాలనే విషయంపై అధ్యయనంచేస్తుందని కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు జైరాం రమేష్ చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకుసంప్రదింపుల ప్రక్రియకు విధివిధానాలనురూపొందిస్తుందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంటుసభ్యుల సమావేశంలో పాల్గొనడానికిఆయన హైదరాబాద్ వచ్చారు. ఆయనఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకుఎన్నికైన విషయం తెలిసిందే.తెలంగాణపై ఐక్య ప్రగతిశీల కూటమి తనకనీస ఉమ్మడి ప్రణాళిక (సియంపి)లోస్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.సియంపిలో తెలంగాణపై ఉన్న వాక్యాలనుఆయన చదివి వినిపించారు. ఈ వాక్యంలోని ప్రతిమాటకూ అర్థం ఉన్నదని ఆయనఅన్నారు.రాష్ట్రంలోనినీటి పారుదల ప్రాజెక్టులకు ఎక్కువనిధులు రావాలంటే కొన్ని ప్రాజెక్టులనుజాతీయ ప్రాజెక్టులుగా కేంద్రంస్వీకరించాల్సి వుంటుందని, ఇటువంటిసందర్భాలు గతంలో ఉన్నాయని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
