బాలకృష్ణ కేసు: బెల్లంకొండ, చౌదరిలపై పిటిషన్ విచారణ
హైదరాబాద్: సినీనటుడు బాలకృష్ణ కాల్పుల కేసులో తప్పుడు సాక్ష్యమిచ్చారనే ఆరోపణపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరిలపై ఈ పిటిషన్ దాఖలైంది. వారిద్దరిపై కేసులు నమోదు చేయడానికి అనుమతించాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. బాలకృష్ణనే తమపై కాల్పులు జరిపారని వారిద్దరు మొదట తమ వాంగ్మూలంలో చెప్పారు. అయితే మాట మార్చి తమపై కాల్పులు జరిపింది బాలకృష్ణ కాల్పులు జరపలేదని చెప్పారు.
బాలకృష్ణపై, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నంచారని వసుంధరాదేవిపై దాఖలైన కేసును సాక్ష్యాలు లేవనే ఉద్దేశంతో కోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసును సిబిఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications