ఖండఖండాలుగా విడిపోతున్న మేఘాలు.. బంగాళాఖాతంలో ద్రోణి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (NLM) ప్రస్తుతం హర్నై, సోలాపూర్ మీదుగా తెలంగాణలోని హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అటుపై కళింగపట్నం, పారాదీప్, ముజఫర్‌పూర్ మీదుగా కొనసాగుతోంది. రాబోయే 4 నుంచి 5 రోజులలో తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

బంగాళాఖాతంలో ద్రోణి.. బలహీనపడిన ఆవర్తనం

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ తమిళనాడు వరకు, సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఒక ద్రోణి (Trough) విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోకి తగినంత తేమ గాలులు వీస్తున్నాయి. మరోవైపు, దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం (Cyclonic circulation) క్రమంగా బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం విశ్లేషించింది.

Telangana Rain Alert Meteorological Department Warns of Strong Winds and Lightning for Next 72 Hours
కళింగపట్నం వరకు విస్తరించిన రుతుపవనాలు. ఏపీకి తుపాను గండం!
కళింగపట్నం వరకు విస్తరించిన రుతుపవనాలు. ఏపీకి తుపాను గండం!

రాగల 3 రోజుల వాతావరణ సూచన

ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం చల్లబడనుంది. ఈరోజు (ఆదివారం), రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలలో రానున్న మూడు రోజులలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవని, ఎండల తీవ్రత తగ్గి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.

ఏపీలో ముంచెత్తబోతున్న వానలు.. కుండపోతే
ఏపీలో ముంచెత్తబోతున్న వానలు.. కుండపోతే

వాతావరణ హెచ్చరికలు: గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

వర్ష సూచనతో పాటు వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణం ఒక్కసారిగా మారి, వర్షం పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని సంచాలకులు హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ప్రయాణికులు ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+