వీడియో వైరల్: దొంగతనం చేసి.. అదే ఇంట్లో గురకపెట్టి నిద్రపోయిన దొంగ
సాధారణంగా ఏ దొంగ అయినా దొంగతనం చేశాక అక్కడి నుంచి వీలైనంత త్వరగా పారిపోతాడు. అలా రాష్ట్రాలు.. దేశాలను కూడా దాటేసిన వాళ్లు ఉన్నారు. కానీ ఓ దొంగ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఓ ఇంట్లో చోరీ చేసి మద్యం మత్తులో అక్కడే గురక పెట్టి నిద్రపోయాడు. మరుసటి రోజు రూమ్ లోంచి గురక శబ్దం రావడంతో యజమాని గమనించగా ఆ దొంగ నిద్రపోయి కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో జరిగింది.
చోరీకి వెళ్లి.. గురకపెట్టి నిద్రపోయిన దొంగ
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 13, 2026
హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకున్న విచిత్రమైన ఘటన
ఓ ఇంట్లో చోరీ చేసేందుకు.. మద్యం మత్తులో చొరబడిన ఓ యువకుడు
బంగారం, విలువైన వస్తువుల కోసం వెతికి.. బెడ్రూంలోనే నిద్రపోయాడు
ఉదయాన్నే లేచిన యజమానికి గురక శబ్దం రావడంతో.. రూంలోకి వెళ్లి… pic.twitter.com/qqyLctQHEE
హైదరాబాద్ మహానగరంలో దోపిడీ ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉంటాయి. పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినా.. నగరం వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పరచినా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో నిత్యం దోపిడీ ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లోని పాతబస్తీలో ఓ విచిత్రమైన దోపిడీ ఘటన జరిగింది. ఏ దొంగ అయినా చోరీ జరిగిన ప్రాంతం నుంచి దూరంగా పారిపోతాడు. కానీ ఈ దొంగ మాత్రం చోరీ చేసి ఆ ఇంట్లోనే గురక పెట్టి నిద్రపోయాడు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ లోని వాడి- ఎ -ముస్తఫా ప్రాంతంలోని ఓ ఇంట్లో చోరీ చేయడానికి ఓ దొంగ చొరబడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఆ దొంగ ఇంట్లోని విలువైన వస్తువులు, గోల్డ్, మొబైల్ ఫోన్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోవాల్సింది.. బదులుగా ఆ రూమ్ లోనే గురకపెట్టి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రూమ్ నుంచి గురక శబ్దం వస్తున్నట్లు గుర్తించిన యజమాని డోర్ తెరిచి చూశాడు. నిందితుడు తాపీగా నిద్రపోతూ కనిపించాడు. ఆ దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిన యజమాని.. నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications