Agadha First Review: ఒళ్లు గగుర్పొడితే మిస్టికల్ హార్రర్ థ్రిల్లర్..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఎంఎస్ రాజు ముందుంటారు. ఆయన పేరు వినగానే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకొస్తాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఒక్కడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో వర్షం సినిమాలను తెరకెక్కించారు. 1991 లో విక్టరీ వెంకటేశ్ తో శత్రువు సినిమాతో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999 లో దేవి, 2001 లో దేవి పుత్రుడు, మనసంతా నువ్వే సినిమాలు నిర్మించారు. 2003 లో ఒక్కడు, 2004 లో వర్షం సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత 2005 లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత పౌర్ణమి, ఆట, వాన, మస్కా తదితర చిత్రాలు నిర్మించారు. గత కొంత కాలంగా ఆయన సినిమా ప్రొడక్షన్ కు దూరంగా ఉంటున్నారు. అయితే దర్శకుడిగా మాత్రం సినిమాలు చేస్తూ వస్తున్నారు.

2020 లో డర్టీ హరి, 2022 లో 7 డేస్ 6 నైట్స్, 2023 లో మళ్లీ పెళ్లి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఇప్పుడు 2026 లో 'అగధ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదొక డివైన్, మిస్టిక్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాను శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఈ చిత్రానికి అజయ్ కే ఆర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయరాణిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా విడుదలకు సిద్ధం అయింది.

అగధ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చుట్టూ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మహిమ అనే గర్భిణీ ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును మహాదేవి అనే మహిళ ప్రారంభించడంతో కథ స్టార్ట్ అవుతుంది. ఈ విచారణలో భాగంగా మహాదేవికి ఒక రహస్యమైన చీకటి లోకానికి చెందిన అతీంద్రియ శక్తి ఎదురవుతుంది. అయితే ఆ దైవిక శక్తులకు.. చీకటి లోకానికి చెందిన అతీంద్రీయ శక్తులకు మధ్య జరిగే తీవ్రమైన పోరాటమే ఈ చిత్రంలోని ప్రధాన అంశంగా ఉంటుంది. చివరగా మూఢ నమ్మకాలతో జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి..? అనే కోణంలో కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. ఈ మేరకు సెన్సార్ అధికారులు దర్శకుడు ఎంఎస్ రాజును, ఆయన టీమ్ ‌ను అభినందించినట్లు తెలుస్తోంది.

Agadha first review of the horror movie directed by prominent Tollywood producer director MS Raju

ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 17 నిమిషాలకు పరిమితం చేశారు. అంటే సుమారుగా 137 నిమిషాల రన్ టైమ్‌ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. తక్కువ రన్ టైమ్ కాబట్టి ప్రేక్షకుల్ని ఈ మూవీ థ్రిల్ చేస్తుందని మూవీ టీమ్ నమ్ముతోంది. అగధ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ అయింది. అంటే 18 ఏళ్లు పైబడిన వాళ్లు ఈ సినిమాను వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+