రైతుల ఇంట కాసుల పంట పండించే ఆ పంటపై తెలంగాణా ఆసక్తి!

తెలంగాణ రాష్ట్రంలో వైవిధ్య పంటల సాగుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న వేళ కొత్త పంట సాగు ఆలోచన చేస్తుంది తెలంగాణా సర్కార్. తెలంగాణా రాష్ట్రానికి వచ్చిన బీహార్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రితో తెలంగాణా మంత్రి తుమ్మల భేటీ మఖానా సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చేసింది.. హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన భేటీలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్‌కుమార్ సిన్హా పంటల వైవిధ్యీకరణ, సాంకేతికత మార్పిడిపై చర్చించారు.

మఖానా సాగుపై తెలంగాణా ఆసక్తి

బీహార్‌లో ప్రసిద్ధి చెందిన మఖానా సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పద్ధతులపై తెలంగాణ ప్రత్యేక ఆసక్తి కనబరిచింది. అదే సమయంలో తెలంగాణలో విజయవంతంగా విస్తరిస్తున్న ఆయిల్‌పామ్ సాగును అధ్యయనం చేయడానికి బీహార్ సిద్ధమైంది. మఖానా సాగుపై అధ్యయనం చెయ్యాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణా ఆ దిశగా మఖానా సాగుపై అధ్యయనం చేయనుంది.

Makhana cultivation Telangana shows interest in Makhana cultivation Collaboration with Bihar

మఖానా సూపర్ ఫుడ్.. మార్కెట్ లో డిమాండ్

మఖానా చాలా సూపర్ ఫుడ్‌గా పేరుగాంచింది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. క్యాలరీలు, కొవ్వు తక్కువగా ఉండటంతో డయాబెటిస్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు దీన్ని ఇష్టపడుతున్నారు. విదేశీ మార్కెట్‌లో కూడా మఖానాకు డిమాండ్ పెరుగుతోంది. బీహార్‌లో ముఖ్యంగా మిథిలా ప్రాంతంలో దేశంలోని 80-90 శాతం మఖానా ఉత్పత్తి జరుగుతుంది.

మఖానా ఎలా సాగు చేస్తారు అంటే

మఖానా సాగు రెండు పద్ధతుల్లో జరుగుతుంది. సాంప్రదాయ పాండ్ సిస్టమ్‌లో చెరువులు, నీరు నిలిచే ప్రాంతాల్లో 1 నుంచి 1.5 మీటర్ల లోతు నీరు ఉండాలి. డిసెంబర్-జనవరిలో చెరువులను శుభ్రం చేసి, కలుపు మొక్కలు తొలగిస్తారు. విత్తనాలు చల్లుతారు లేదా నర్సరీలో పెంచిన మొక్కలను ఫిబ్రవరి-మార్చిలో నాటుతారు. జూలై నుంచి అక్టోబర్ వరకు పంట కోత జరుగుతుంది. కార్మికులు నీటిలోకి దిగి అడుగున పడిన విత్తనాలను సేకరిస్తారు.

ఇలా మఖానా సాగు చేస్తే ఎకరానికి కనీసం రూ.1.5 లక్షల నికర లాభం

ఆధునిక ఫీల్డ్ సిస్టమ్‌లో తక్కువ నీటి లోతు 6-12 అంగుళాలు ఉన్న పొలాల్లో కూడా మఖానా సాగు సాధ్యమవుతుంది. భూమిని దున్ని, ఎరువులు వేసి నీరు నింపి విత్తనాలు చల్లుతారు లేదా మొక్కలు నాటుతారు. ఈ పద్ధతిలో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చెరువుల్లో మఖానాతో పాటు చేపల పెంపకం కూడా చేస్తే అదనపు ఆదాయం వస్తుంది. మఖానా సాగు చేస్తే ఎకరానికి కనీసం రూ.1.5 లక్షల నికర లాభం వస్తుందని అంచనా.

మాకొక ఎయిర్ పోర్ట్ కావలెను.. పార్లమెంట్ సాక్ష్గిగా పెద్ద డిమాండ్!
మాకొక ఎయిర్ పోర్ట్ కావలెను.. పార్లమెంట్ సాక్ష్గిగా పెద్ద డిమాండ్!

మఖానా సాగుతో రైతుల ఇంట కాసుల పంటే

తెలంగాణ అధికారులు బీహార్ పద్ధతులను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రారంభించే అవకాశం ఉంది. మఖానా సాగు తెలంగాణ రైతులకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. తెలంగాణా వ్యవసాయ శాఖ సాగుపై అధ్యయనం చేసి సాగుకు సై అంటే మఖానా సాగుతో రైతుల ఇంట కాసుల పంటే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+