Shakeela: ఫోన్ కు బానిసై ఇప్పుడు నడవలేని స్థితిలో నటి షకీలా.. రూ. 3 లక్షల సర్జరీ చేయించుకుని..
సినీ నటి షకీలా పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా మారింది. మొబైల్ ఫోన్ వ్యసనం కారణంగా ఆమె మెడ నరాలు దెబ్బతిన్నాయి. దాంతో రూ. 3 లక్షలు ఖర్చు చేసి సర్జరీ చేయించుకుంది షకీలా. గంటల తరబడి మొబైల్ ఫోన్ వాడటం, తప్పు భంగిమలో పడుకుని వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటమే తన తీవ్ర ఆరోగ్య సమస్యకు కారణమైందని ఆమె వెల్లడించారు. ఈ మేరకు స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలంటూ ప్రజలకు షకీలా హెచ్చరిక ఇచ్చారు.
ఇటీవలికాలంలో ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా సోషల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ రీల్స్ అంటూ గంటల తరబడి ఫోన్ కు బానిస అవుతున్నారు. పిల్లలు, విద్యార్థులు తమ భవిష్యత్తును పక్కనపెట్టి ఫోన్ మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే సినీ నటి షకీలా కూడా ఇలాంటి పరిస్థితినే చూశారు. ఆమె ఫోన్ కు బానిసయ్యారు. పడుకుని గంటల తరబడి ఫోన్ లో రీల్స్ చూడటంతో తీవ్రమైన నరాల సమస్య వచ్చింది. అలా రూ. 3 లక్షలు ఖర్చు చేసి మెడకు సర్జరీ చేయించుకున్నారు. ఈ చేదు అనుభవాన్ని ఆమె స్వయంగా వెల్లడిస్తూ.. మొబైల్ వినియోగంపై అభిమానులకు గట్టి హెచ్చరిక కూడా చేశారు.
ఇటీవల సర్జరీ తర్వాత ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన షకీలా.. మెడకు కాలర్ ధరించి ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తనకు ఈ పరిస్థితి పట్టడానికి గల కారణాలను బహిరంగంగా పంచుకున్నారు. తాను ఓ పక్కకు తిరిగి ఫోన్ లో గంటల తరబడి రీల్స్ చూస్తూ.. గేమ్స్ ఆడేదాన్ని అని అన్నారు. యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ చూసేదాన్ని అని చెప్పుకొచ్చారు.

మధ్యమధ్యలో టీ, కాఫీ కోసం మాత్రమే లేచేదాన్ని అని పేర్కొన్నారు. దాంతోనే తనకు తీవ్ర ఆరోగ్య సమస్య వచ్చింది. ఈ సమస్య కారణంగా రూ.3 లక్షల వ్యయంతో మెడ శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. ఈ ఘటన తర్వాతే మొబైల్ వినియోగం ఎంత ప్రమాదకరమో అర్థం అయిందని పేర్కొన్నారు. అనవసరమైన వీడియోలు చూస్తూ గంటల తరబడి గడపడం మానుకోవాలని సూచనలు చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications