బెంగళూరులో నూతన పార్కింగ్ విధానం- రోడ్డు పక్కన బండి ఆపినా..: నోటిఫికేషన్

బెంగళూరులో వాహనదారులకు భారీ షాక్ తగలనుంది. నగరంలో ఇష్టారాజ్యంగా సాగుతున్న ఉచిత పార్కింగ్‌ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ నూతన పార్కింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. దీనికోసం ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటికేషన్‌ను సైతం విడుదల చేసింది. నగరంలో రద్దీ ప్రాంతాలను మూడు భాగాలుగా విభజిస్తారు. వాటిని బట్టి వాహనాల పార్కింగ్‌కు గంటలు, నెలవారీగా ఫీజులను వసూలు చేయాలని ప్రతిపాదించారు.

దీని ప్రకారం.. ప్రయాణికులు ఎక్కువగా తిరిగే మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారుల సమీపంలో పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించనున్నారు. సిగ్నల్స్‌కు 50 మీటర్ల లోపు, సబ్ రోడ్లకు 25 మీటర్ల పరిధిలో ఎలాంటి వాహనాలను నిలపడానికి వీల్లేదు. రాత్రి వేళల్లో వాహనాలు నిలుపుకోవడానికి కొంత ఊరట కల్పించారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిర్దేశిత ప్రాంతాలలో వాహనాలు నిలిపే వీలుంది. సైకిళ్లు, ఆటో స్టాండ్‌లకు ఎలాంటి పార్కింగ్ ఛార్జీలు ఉండవు.

Bengaluru Parking Costs Set to Jumps as charges will vary depending on the category of road draft rules

నగరంలో ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు తమ కిరాయిదారులకు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని కల్పించాలనే నిబంధనను తీసుకురానున్నారు. ఒకవేళ పార్కింగ్ సౌకర్యం కల్పించకపోతే ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు. ఖాళీ స్థలాలను పార్కింగ్ కోసం కేటాయించే ప్రైవేటు యజమానులకు ఆస్తి పన్నులో మినహాయింపు ఇవ్వనున్నారు. ప్రభుత్వ సంస్థల పరిధిలోని ఖాళీ ప్రదేశాలను కూడా ఉపయోగించుకుని పార్కింగ్ గండాలను అధిగమించాలని గ్రేటర్ బెంగళూరు అథారిటీ యోచిస్తోంది.

కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతం
కర్ణాటక బంద్ ఎఫెక్ట్: బెంగళూరులో నామమాత్రం- ఆ 5 జిల్లాల్లో ఉధృతం

బెంగళూరు వాహనదారులు చెల్లించాల్సిన రుసుములను వాహనాల రద్దీ, అక్కడున్న డిమాండ్‌ ఆధారంగా కేటగిరీల వారీగా ప్రభుత్వం వర్గీకరించింది. రోడ్డు పక్కన పార్కిం చేయడాన్ని ఆన్-స్ట్రీట్ గా పేర్కొంది. నిర్దేశిత స్థలాల్లో ఉంచే వాహనాలను ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్‌గా గుర్తించింది. వాటికి నెలవారీ పాస్ పొందే వారికి వేర్వేరు ధరలను ఈ డ్రాఫ్ట్ లో పొందుపరిచారు. ద్విచక్ర వాహనాలు, కార్లకు వర్తించే కనీస ఛార్జీల వివరాలిలా ఉన్నాయి.

బెంగళూరులో ఇకపై అలా చేస్తే వాహనాలను వెంటనే సీజ్ చేస్తారు..
బెంగళూరులో ఇకపై అలా చేస్తే వాహనాలను వెంటనే సీజ్ చేస్తారు..
  • ఎ-కేటగిరీ- అధిక రద్దీ. ఇక్కడ ఆన్ స్ట్రీట్ గంటకు.. స్కూటర్లకు రూ. 40 కార్లకు రూ. 80 చెల్లించాల్సి ఉంటుంది. అవే వాహనాలు ఆఫ్ స్ట్రీట్ లో పార్క్ చేస్తే స్కూటర్లు గంటకు రూ. 20, కార్లు రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కేటగిరీలో స్కూటర్లకు నెలవారీ పాస్ రూ. 2,000 కాగా కార్లకు రూ. 40,000 కట్టాలి.
  • బీ-కేటగిరీ- మధ్యస్థ రద్దీ. ఇక్కడ ఆన్-స్ట్రీట్ లో గంట పార్కింగ్ కు స్కూటర్లు రూ. 30, కార్లు రూ. రూ. 60 చెల్లించాలి. ఆఫ్-స్ట్రీట్ లో పార్క్ చేసే స్కూటర్లు గంటకు రూ. 15, కార్లు రూ. 30 కట్టాలి. నెలవారీ పాస్ స్కూటర్లకు రూ. 1,500, కార్లకు రూ. 3,000 చెల్లించాల్సి ఉంటుంది.
  • సీ-కేటగిరీ- తక్కువ రద్దీ. ఇక్కడ ఆన్-స్ట్రీట్ లో స్కూటర్లకు గంటకు రూ. 10, కార్లకు రూ. 20 వసూలు చేస్తారు. నెలవారీ పాస్ ధర స్కూటర్లకు రూ. 1,000, కార్లకు రూ. 2,000గా నిర్ధారించారు.

బెంగళూరు ఐటీ హబ్‌లో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి, రోడ్లపై అడ్డగోలుగా వాహనాలు నిలిపివేయడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తాజా నిబంధనలను ప్రవేశపెట్టింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం జీబీఏ ఈ నూతన పార్కింగ్ విధానాన్ని అధికారికంగా అమలు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+