విశాఖ జిల్లాలో కానిస్టేబుల్‌ను కాల్చి చంపిన నక్సల్స్
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా సీలేరులో మావోయిస్టు నక్సలైట్లు ఒక కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. బాబూరావు అనే కానిస్టేబుల్‌ను ఇద్దరు ముసుగు ధరించిన సాయుధ నక్సలైట్లు కాల్చి చంపారు. తన ఇద్దరు పిల్లలను బాబూరావు పాఠశాలలో వదిలి వస్తుండగా కాన్వెంట్ వద్ద మాటు వేసి చాలా దగ్గరి నుండి కాల్చి చంపారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కోమలి శేషగిరిరావు అలియస్ గోపన్న అరెస్టు నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు ఇటీవల గూడెం కొత్తవీధి మండలంలో ఏడు చోట్ల మందుపాతరలను వెలికి తీశారు.












Click it and Unblock the Notifications