భారీ ఎన్‌కౌంటర్‌: రమేష్‌ సహా 10 మంది హతం

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం జ్యోతియా తండా సమీపంలోని మానాల అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సిపి ఐ (మావోయిస్టు) కరీంనగర్‌ పశ్చిమ డివిజన్‌ కమిటీ కార్యదర్శి రమేష్‌తో సహా పది మంది నక్సలైట్లు మరణించారు. మరణించినవారిలో జిల్లా దళ సభ్యుడు బాబన్న, జ్యోతి, స్నేహ, దళ కమాండర్లు శీను, రఘు, శోభ తదితరులున్నారు. ముగ్గురు మహిళా నక్సలైట్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. వీరిలో జ్యోతి రమేష్‌ భార్య. సంఘటనా స్థలం నుంచి ఎ.కె. 47, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నక్సలైట్ల వాకీటాకీని కూడా పోలసీలు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ నాయకత్వంలో జరగాల్సిన గోదావరి, కథలాపూర్‌, భీంగల్‌ లోకల్‌ గెరిల్లా స్క్వాడ్‌ పోలీసులు భగ్నం చేశారు. మూడు దళాలకు చెందిన పదహారు మందితో ఈ సమావేశం తలపెట్టారు. మిగతావారు ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.

రమేష్‌ స్వగ్రామం కరీంనగర్‌ జిల్లా మల్లాపూరం మండలం మొగిలిపేట కాగా బాబన్న స్వగ్రామం అదే జిల్లా కోనారావుపేట మండలం వట్టిమల్ల. శోభది కూడా ఇదే గ్రామం. ప్రవీణ్‌ది మోడెపల్లి గ్రామం. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రమేష్‌ 16 యేళ్ల క్రితం పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరాడు. దాదాపు 50 కేసుల్లో అతను నిందితుడని చెబుతున్నారు. గతంలో రెండు, మూడు ఎన్‌కౌంటర్ల నుంచి అతను తప్పించుకున్నాడు.

దీన్ని బూటకపు ఎన్‌కౌంటర్‌గా మావోయిస్టు ప్రతినిధి జి. కళ్యాణరావు విమర్శించారు. నక్సలైట్లు సంయమనం పాటించకుండా ప్రభుత్వం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వం, పోలీసులు రాష్ట్రాన్ని వల్లకాడుగా మారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిఘటన తప్పతని ఆయన అన్నారు. ప్రభుత్వం, పోలీసులు కుట్ర పన్ని నక్సలైట్లను హతమారుస్తోందని ఆయన అన్నారు. కచ్చితమైన సమాచారం మేరకే పోలీసులు మావోయిస్టులపై కాల్పులు జరిపారని మావోయిస్టు ప్రతినిధి వరవరరావు అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పోలీసులకు, నక్సలైట్లు ఎదురుపడినప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తనకు సమాచారం అందిందని హోం మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. భారీ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులను, శాసనసభ్యులను హైదరాబాద్‌కు రావాల్సింగా పోలీసు అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+