నక్సల్స్‌తో చర్చలు సాధ్యం కావు: కెకె
హైదరాబాద్: నక్సలైట్లతో రెండో దశ చర్చలు ఇప్పట్లో సాధ్యం కావని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అభిప్రాయపడ్డారు. చర్చలకు అనుకూలవాతరణం లేదని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మావోయిస్టులే అందుకు సిద్ధపడాలని ఆయన అన్నారు.
ఇరు వర్గాల మధ్య పరిస్థితి చేయి దాటిపోతోందని ఆయన అన్నారు. నక్సలైట్లపై నిషేధం విధించే విషయం ప్రభుత్వానికి సంబంధించిందని ఆయన అన్నారు. ఇరువైపులా హింస, ప్రతిహింస ఆగిపోవాలని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఆయన అన్నారు. వేంపెంట సంఘటన గర్హనీయమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications