నిజామాబాద్ ఎన్‌కౌంటర్ దురదృష్టకరం: వైయస్
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎన్‌కౌంటర్ దురదృష్టకరమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. నకసలైట్లపై నిషేధం విధించే విషయంపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
శాంతి చర్చలు జరుగుతాయనే ఆశ తనకు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు, గ్రూపులు ఆయుధాలను కలిగి ఉండకూడదని, ఆయుధాలతో తిరగరాదని ఆయన అన్నారు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
16 మంది నక్సలైట్లు ఒక దగ్గర గుమికూడారంటే విధ్వంసాన్ని అనుమానించామని, విధ్వంసానికి నక్సలైట్లు పథక రచన చేస్తూ ఉండవచ్చుననే అనుమానం కలిగిందని, అందుకే పోలీసు పార్టీని అక్కడికి పంపామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్ అన్నారు. నిజామాబాద్ ఎన్‌కౌంటర్‌పై ఆయన మీడియా ప్రతినిధులకు వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications