శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తి వైఫల్యం: బాబు
హైదరాబాద్: శాంతిభద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని శాంతిభద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఆయన ఆదివారం అన్నారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని, రాష్ట్రాన్ని ఈ పరిస్థితి నుంచి కాపాడటానికి యువత ఉద్యమించాలని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
తమ విద్యార్థి అనుబంధ సంస్థ తెలుగు విద్యార్థి తిరిగి ఆచరణలోకి వస్తుందని ఆయన అన్నారు. విద్యార్థులకు వేదిక లేకుండా పోయిందని, అందువల్ల తెలుగు విద్యార్థిని పునరుద్ధరించాలని అనుకుంటున్నామని, అయితే అది నిర్మాణాత్మకంగా పని చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications