నక్సలైట్లపై దూరదృష్టి లేని ప్రభుత్వం: దత్తాత్రేయ
వరంగల్: నక్సలైట్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరదృష్టి లేని, నక్సటైట్ సమస్య పట్ల కనీస అవగాహన కూడా లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ విమర్శించారు. నక్సలైట్లతో రెండో దశ చర్చలు విఫలం కావడానికి బాధ్యులెవరో చెప్పాలని ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రోద్యమానికి ప్రతీక అయిన దండియాత్రను కాంగ్రెస్ నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు. దండియాత్ర నిర్వహించడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎవరని ఆయన అడిగారు. సోనియా గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications