గాంధీని చంపినవారికి ఆ హక్కెక్కడిది?: ఎమ్మెస్సార్
హైదరాబాద్: గాంధీని చంపినవారికి దండి యాత్ర గురించి మాట్లాడే హక్కు లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావు అన్నారు. దండియాత్రలో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దండియాత్రను భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. దండియాత్ర ఉత్తమ సందేశాన్ని అందిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి పెచ్చరిల్లుతోందని, ఈ స్థితిలో దండియాత్ర శాంతి సందేశం అందించి ప్రపంచ గమనానికి మార్గనిర్దేశం చేస్తుందని ఆయన అన్నారు.
దండియాత్రను కాంగ్రెస్ కార్యక్రమంగా చేపట్టడాన్ని బిజెపి అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీ విమర్శించారు. స్వాతంత్య్ర చారిత్రక ఘట్టమైన దండి యాత్రను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications