గాంధీ స్ఫూర్తితోనే పాదయాత్రలు చేశా: వైయస్
అహ్మదాబాద్: మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే శాసనసభ ఎన్నికలకు ముందు తాను వేలాది కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ చేపట్టిన దండియాత్రలో ఆయన పాల్గొన్నారు. దండికి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల పస్రాలీ నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ఆయన పాదయాత్ర చేశారు. ఆయనతో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ రావు, పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
అహింస ద్వారానే దేన్నయినా సాధించగలమని ముఖ్యమంత్రి అన్నారు. గాంధీ చూపిన మార్గంలో నడవడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితోనే తాను వేల కిలోమీటర్ల పాదయాత్రలు నిర్వహించి గత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టానని ఆయన అన్నారు. దండియాత్రలో పాల్గొనడం కొత్త అనుభూతి అని కేశవరావు అన్నారు. గాంధీమార్గాన్ని అందరూ ఆచరించేలా కృషి చేయడం అవసరమని ఆయన అన్నారు. అహింసా మార్గమే అనుసరణీయమని ఎం. సత్యనారాయణ రావు అన్నారు.












Click it and Unblock the Notifications