మోడీ వీసానిరాకరణ: అమెరికా వివరణ
వాషింగ్టన్:భారతదేశ జాతీయ మానవ హక్కులసంఘం నివేదిక ఆధారంగానే గుజరాత్‌ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వీసానునిరాకరించినట్టు అమెరికా స్పష్టం చేసింది. ఈవిషయంలో ఏ అమెరికన్ నివేదికనుపరిగణనలోకి తీసుకోలేదని అమెరికాతెలిపింది. 2002 గుజరాత్ మారణకాండవెనుక నరేంద్ర మోడీ హస్తంఉందని అమెరికా నిర్ధారించినట్టు కాదనిఅమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీస్పోక్స్‌మన్ ఆడం ఎరేలీ మీడియాప్రతినిధులకు చెప్పారు. గుజరాత్‌అల్లర్లపై భారత ప్రభుత్వానికి చెందినజాతీయ మానవహక్కుల సంఘం విచారణజరిపి, హింసను నిరోధించడంలో,మతసామరస్యాన్ని కాపాడడంలోపాలకులు విఫలయ్యారని తేల్చిన విషయంవాస్తవమని ఆయన పేర్కొన్నారు. మోడీటూరిస్టు/బిజినెస్ వీసాను తాము రద్దుచేశామని, దౌత్య వీసా ఇవ్వడానికినిరాకరించామని న్యూఢిల్లీలోని అమెరికన్‌ఎంబసీ శనివారం ప్రకటించింది. కాబట్టి ఇదిజరిగిందని, అది జరగలేదని అమెరికన్‌ప్రభుత్వం వ్యాఖ్యానించినట్టు కాదనితెలిపింది. మోడీకి గతంలో టూరిస్టు వీసా ఎలాఇచ్చారని ప్రశ్నించగా దానిని గుజరాత్‌అల్లర్లకు ముందు ఇచ్చి ఉంటారని ఎరేలీసమాధాన మిచ్చారు.












Click it and Unblock the Notifications