ఇండియన్ ప్రశ్నలకు ముషార్రఫ్ జవాబులు
ఇస్లామాబాద్: కార్గిల్ వంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత్, పాక్‌లు కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అభిప్రాయపడ్డారు. ఒక ఇండియన్ ఇ-మెయిల్ ద్వారా పంపిన ప్రశ్నలకు ముషార్రఫ్ వివరమైన సమాధానాలు ఇచ్చారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే పాక్, భారత్‌ల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆయన అనానరు.
భారత్, పాక్‌ల విలీనానికి గల అవకాశాల గురించి వేసిన ప్రశ్నకు విలీనం సాధ్యం కాదని ముషార్రఫ్ చెప్పారు. కార్గిల్ గురించి ప్రస్తావిస్తూ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనే చర్చలోకి తాను వెళ్లదలుచుకోలేదని ఆయన అన్నారు. కార్గిల్ సందర్భంగా మరణాల సంఖ్యను భారత్ సరిగా చెప్పలేదని, ఇండియన్ ఆర్మీ ఎదుర్కున్న సమస్యల గురించి మీడియా చాలా రాసిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications