28 గాడిదలు కథ: మారిపోయిన దేశ భవితవ్యం! ఎడారిలో మహా అద్భుతం
మనుషుల నిర్లక్ష్యానికి నాశనమైన ప్రకృతిని తిరిగి ప్రాణం పోయడం సాధ్యమేనా? ఎండమావులు తప్ప చుక్క నీరు కూడా దొరకని కఠినమైన ఎడారిని మళ్లీ పచ్చని ప్రాంతంగా మార్చడం ఏ యంత్రాల వల్లైనా అవుతుందా? అంటే కచ్చితంగా కాదనే సమాధానమే వస్తుంది. కానీ, సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న ఒక చిన్న వినూత్న నిర్ణయం ప్రపంచ పర్యావరణ చరిత్రలోనే అతిపెద్ద అద్భుతానికి శ్రీకారం చుట్టింది. కేవలం 28 అడవి గాడిదలను ఎడారిలోకి వదిలిపెడితే.. ఈనాడు ఆ మండుటెండల్లో ఒక పచ్చని ఒయాసిస్ (Oasis) ఏర్పడి, వందలాది జీవరాశులకు జీవనాధారంగా మారింది.
విప్లవాల నడుమ నడిచిన రహస్య ఆపరేషన్!
ఒకప్పుడు నెగెవ్ (Negev) ఎడారి ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగిన అడవి గాడిదలు, 20వ శతాబ్దం ప్రారంభంలో వేటగాళ్ల దెబ్బకు పూర్తిగా అంతరించిపోయాయి. పోయిన జాతిని మళ్లీ తమ నేలపైకి తీసుకురావాలని ఇజ్రాయెల్ అధికారులు నిశ్చయించుకున్నారు. అయితే, ఇవి మనం చూసే సాధారణ గాడిదలు కావు; 'పర్షియన్ ఒనేగర్స్', 'ఇథియోపియన్ ఆఫ్రికన్ వైల్డ్ యాస్' అనే అత్యంత అరుదైన, వేగంగా పరిగెత్తే జాతులు.

1979 నాటి ఇస్లామిక్ విప్లవానికి ముందే ఇరాన్ షాతో రహస్యంగా చర్చలు జరిపి 11 పర్షియన్ గాడిదలను విమానంలో తెప్పించారు. ఆ తర్వాత ఇథియోపియా నుంచి ప్రత్యేక నౌకల్లో మరో జాతిని రప్పించి, రెండింటినీ క్రాస్ బ్రీడింగ్ చేసి అత్యంత రోగనిరోధక శక్తి ఉన్న బలమైన సంతతిని ఉత్పత్తి చేశారు. అలా రూపుదిద్దుకున్న 28 అడవి గాడిదలను 1982లో 'రామన్ క్రేటర్' అనే ఎడారి ప్రాంతంలోకి విడుదల చేశారు.
ఎడారి వోసిస్‌గా మారిన నీటి తవ్వకాలు!
ఇప్పుడు ఆ గాడిదల సంఖ్య 500 నుంచి 600కు పెరిగింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగల ఈ జీవులు, నిప్పులు చెరిగే 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటూ నీళ్లు లేకుండా రోజుల తరబడి బతకగలవు. దాహం వేసినప్పుడు తమ గిట్టలతో ఇసుకను తవ్వుతూ ఏకంగా 6.5 అడుగుల లోతు వరకు గుంతలు తీస్తాయి. భూగర్భంలో ఉన్న నీటి ఊటలు బయటపడి, చిన్న చిన్న నీటి గుంటలుగా మారుతాయి. ఈ గాడిదలు తవ్విన నీటి గుంటలే ఇప్పుడు ఎడారిలోని నక్కలు, జింకలు, రకరకాల పక్షుల దాహార్తిని తీర్చే సంజీవనిలా మారాయి.
మొక్కలు నాటే అద్భుత రవాణా వ్యవస్థ!
నీటిని వెలికితీయడమే కాకుండా, ఎడారిలో చెట్లను పెంచడంలోనూ ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎడారిలో దొరికే తుమ్మ కాయలను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. వీటి జీర్ణక్రియలో ఉన్న ఆమ్లాలు ఆ విత్తనాల గట్టి పొరను మెత్తగా చేస్తాయి. ఆ తర్వాత ఇవి ఎడారి అంతటా తిరుగుతూ వేసే పేడ ద్వారా ఆ విత్తనాలు నేలలో పడి అత్యంత వేగంగా మొలకెత్తుతాయి. మానవ ప్రమేయం లేకుండానే మైళ్ల కొద్దీ ప్రాంతంలో కొత్తగా పచ్చని చెట్లు మొలకెత్తడానికి ఇవే కారణమయ్యాయి. అంతేకాకుండా, ఇవి నడిచేటప్పుడు పడే కాళ్ల ముద్రలు ఎడారిలో పడే కొద్దిపాటి వర్షపు నీటిని ఆపి భూమిలోకి ఇంకేలా చేస్తున్నాయి.
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయెల్ మోడల్
ఒకవైపు గాడిదలు ఎడారిని బాగు చేస్తుంటే, మరోవైపు ఇజ్రాయెల్శాస్త్రవేత్తలు ప్రాచీన నబాటియన్ సాంకేతికతతో చిన్న చిన్న ఆకట్టుకునే గట్లు, డ్యామ్‌లు కట్టి శీతాకాలపు వరద నీరు వృథా కాకుండా భూగర్భంలోకి ఇంకేలా చేశారు. జంతువుల శ్రమ, శాస్త్రవేత్తల ప్రణాళిక కలసి నాశనమైన ఒక ఎడారిని మళ్లీ జీవకళ ఉట్టిపడే పర్యావరణ వ్యవస్థగా మార్చాయి. మానవాళి స్వార్థానికి దెబ్బతిన్న ప్రకృతిని జంతువుల సహాయంతోనే ఎలా బాగుచేసుకోవచ్చో చెప్పడానికి ఇజ్రాయెల్సాధించిన ఈ విజయం ఇప్పుడు ప్రపంచదేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచింది.














Click it and Unblock the Notifications
