సూరి అనంతపురం తరలింపుపై ఉత్కంఠ

హైదరాబాద్‌: భారీ భద్రత మధ్య మద్దెలచెర్వు సూరిని పోలీసులు అనంతపురం తరలించారు. చెర్లపల్లి జైలు నుంచి ప్రత్యేక ఎస్కార్ట్‌తో సూరిని అనంతపురం బయలుదేరదీశారు. మీడియా ప్రతినిధులను తప్పుదారి పట్టిస్తూ ఆయనను అనంతపురం తీసుకెళ్లారు. 30, 40 మంది ఎస్కార్ట్‌తో సూరిని అనంతపురం తీసుకెళ్లారు. సూరి కాన్వాయ్‌కు అంబర్‌పేట డియస్పీ నాయకత్వం వహించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్యకు పథకం రచించాడని అనుమానిస్తున్న మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరిని ఆదివారం సాయంత్రం అనంతపురం తరలిస్తారని భావిస్తున్నారు. దీంతో మీడియా ప్రతినిధులు చెర్లపల్లి జైలు వద్ద పడిగాపులు పడుతున్నారు. సూరిని రేపున అనంతపురం కోర్టులో ప్రవేశపెడతారు.

సూరి తరలింపు సందర్భంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రహదారి ప్రాంతాల్లో పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సూరి పంటి నొప్పికి శనివారం చికిత్స చేయించారు. సూరి ఆరోగ్యం బాగానే ఉందని జైలు అధికారులు చెప్పారు. సూరి తరలింపుపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+