గన్‌మన్ బాషా మృతదేహానికి రీపోస్టుమార్టం
అనంతపురం: తెలుగుదేశంశాసనసభ్యుడు పరిటాల రవితో పాటు హత్యకు గురైన గన్‌మన్ మహబూబ్ బాషా మృతదేహానికి సోమవారం రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ రీపోస్టుమార్టంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి కొత్త ఆధారలేవీ లభించలేదు. బాషా మృతదేహాన్ని ఫోరెన్సిక్ నిపుణులు అణువణువు క్షుణ్నంగా పరిశీలించారు. భుజం మీద బులెట్ గాయం అయినట్లు తెలుస్తోందని రీపోస్టుమార్టం నిర్వహించిన నిపుణులు చెబుతున్నారు. బాషా మృతదేహం నుంచి ఇది వరకు ఒక బులెట్‌ను వెలికి తీశారు.
పరిటాల రవితో పాటు హత్యకు గురైన తెలుగుదేశం కార్యకర్త ఈశ్వరయ్య మృతదేహానికి సిబిఐ నిపుణుల చేత ఆదివారం రీపోస్టుమార్టం చేయించింది. ఈ రీపోస్టుమార్టంలో కూడా కొత్త ఆధారాలేవీ లభించలేదు. అంతకు పరిటాల రవి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల రవి మృతదేహం నుంచి 9 బుల్లెట్లను వెలికితీశారు.












Click it and Unblock the Notifications
