బహ్రైన్‌లో తిరుపతి టైలర్ ఆత్మహత్య
దుబాయ్: బహ్రేన్‌లోని గార్మెంట్ కర్మాగారంలో టైలర్‌గా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన దాదాపు 400 మంది వర్కర్లు నిరసనకు దిగారు. ఇది హింసకు దారి తీసింది. యువకుడి ఆత్మహత్యకు సంబంధించిన సంఘటనపై విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
అమెరికా కంపెనీ కోసం వస్త్రాలు తయారు చేసే ఫ్యాషన్ హౌస్ ఆవరణలోని గదిలో శనివారం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన మధుబాబు శవం కనిపించిందని మీడియా వార్తలు వెలువడ్డాయి. మధబాబు ఎనిమిది నెలల క్రితం తిరుపతి నుంచి బహ్రేన్‌కు వచ్చాడు. అతను ఫ్యాక్టరీలో లైన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కంపెనీ వేధింపులు తాళలేకనే మధుబాబు ఆత్మహత్య చేసుకున్నాడని వర్కర్లు ఆరోపిస్తున్నారు. గత రెండు వారాలుగా మధుబాబు చికెన్ పాక్స్‌తో బాధపడుతున్నాడని గల్ఫ్ న్యూస్ రాసింది. బాబు శవాన్ని చూసి ఆగ్రహం చెందిన వర్కర్లు విధ్వంసానికి దిగారు. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేశారు. యంత్రాలను, ఐదు కార్లను ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications
