శంకరమఠంలో జయేంద్ర సరస్వతి పూజలు
కాంచీపురం: కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సోమవారం శంకరమఠాన్ని సందర్శించారు. శంకరరామన్ హత్య కేసులో నిరుడు అక్టోబర్‌లో అరెస్టయిన తర్వాత శంకరాచార్య శంకరమఠాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. శంకరమఠంలో ఆయన దాదాపు గంటసేపు ఉన్నారు. ఈ సందర్భంగా పూజ నిర్వహించారు. మహాస్వామి చంద్రశేఖర సరస్వతి అధిష్ఠానం ముందు ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆయన కల్వాయ్ వెళ్లారు.
శంకరరామన్ హత్య కేసులో బెయిల్ మంజూరు చేస్తూ జయేంద్ర సరస్వతి శంకరమఠంలో ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. అయితే కేసులో చార్జిషీట్ దాఖలు చేయడంతో ఆ షరతు అమలులో ఉండదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
