సూరికి 14రోజుల జుడిషియల్‌ రిమాండ్‌

అనంతపురం:పరిటాల రవి హత్య కేసులో ప్రధాన సూత్రధారిగాఅనుమానిస్తున్న మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డిఅలియాస్‌ సూరిని అనంతపురం కోర్టు 14 రోజులపాటు జుడిషియల్‌ రిమాండ్‌కు పంపింది.సూరిని సోమవారం ఉదయం 10.45 గంటలకు అనంతపురంకోర్టులో హాజరుపరిచారు. ఆయనను విచారించేసమయంలో మీడియా ప్రతినిధులనుకోర్టులోకి అనుమతించలేదు. సూరినితమ కస్టడీలోకి తీసుకోవడానికి సిబిఐప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.సూరిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకిఅప్పగించాలని సిబిఐ కోర్టును కోరింది. దీనిపైవాదనలు పూర్తి కాలేదు.

సూరిని భద్రతా కారణాల రీత్యా కాకినాడ కోర్టుకు తరలించాలని సిబిఐ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సూరిని అనంతపురం సబ్‌ జైలులోనే విచారించాలని కూడా కోర్టు ఆదేశించింది. భార్యాపిల్లలను, కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి సూరికి కోర్టు అనుమతించింది. అయితే మిగతా నిందితులెవరూ సూరిని కలుసుకోకూడదని షరతు విధించింది. కోర్టు విచారణ అనంతరం సూరిని అనంతపురం టూటౌన్‌ పోలీసు స్టేసన్‌కు తరలించారు. దీనికి నిరసన తెలియజేస్తూ సూరి మద్దతుదారులు టవర్‌ క్లాక్‌ వద్ద ప్రదర్శనకు దిగారు.

సూరిని హైదరాబాద్‌ చర్లపల్లిజైలు నుంచి ఆదివారం సాయంత్రంకట్టుదిట్టమైన భద్రత మధ్యఅనంతపురానికి తరలించారు.కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్యసూరిని సోమవారం ఉదయంఅనంతపురం కోర్టులో ప్రవేశపెట్టారు.అనంతపురంలోకి వచ్చే దారుల్లోవాహనాలను క్షుణ్నంగా తనిఖీచేశారు.

పరిటాలరవి కేసులోని మిగతా నిందితుల జ్యుడిష్యల్‌కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది.సూరికి జ్యుడిష్యల్‌ కస్టడీ విధించినఅరగంటకే పరిటాల హత్యకేసులోని 12 మందినిందితులను కోర్టులో హాజరు పరిచారు.తమ సంస్థ ఆధ్వర్యంలోనే పరిటాలహత్య జరిగిందని ప్రకటించిన విప్లవదేశభక్త పులుల ( ఆర్పీటీ) నాయకుడుపటోళ్ల గోవర్ధన్‌ రెడ్డిని మాత్రంఇందులో చేర్చలేదు. ఈ 12 నిందితులనువేరే జైలుకు తరలించాలని సిబిఐకోర్టును కోరింది. సూరి, వీరు ఒకే కోర్టులోఉంటే సాక్ష్యాలను తారుమారు చేసేఅవకాశం ఉంటుందని, అందువల్ల వీరినివేరే జైలుకు తరలించాలని సిబిఐ వాదించింది.అందుకు కోర్టు అంగీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+