మాజీ ఐజి మూర్తి అరెస్టుకు రంగం సిద్ధం
హైదరాబాద్: రాయలసీమ మాజీ ఐజి కె.యస్.యన్. మూర్తిని అరెస్టు చేయడానికి హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఒక రౌడీషీటర్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధపడ్డారు. ఆయనను అరెస్టు చేయడానికి అదనపు డిసిపి అశోక్ నేతృత్వంలోని పోలీసు బృందం బంజారాహిల్స్‌లోని మూర్తికి నివాసానికి వెళ్లి వెళ్లారు. అయితే పోలీసులను చూసిన మూర్తి పరారైనట్లు సమాచారం.
కెయస్‌యన్ మూర్తి విషయంపై రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసు కమీషనర్ దినేష్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. రెండో రోజుల క్రితం తస్రీన్ అనే రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీస్రీన్‌కు నేరాల్లో మూర్తి సహకరించారనేది ప్రధానమైన ఆరోపణ. తస్రీన్‌పై 11 కేసులున్నాయి. ఇందులో బలవంతపు వసూళ్లకు, అక్రమ భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులున్నాయి.












Click it and Unblock the Notifications
