హెలికాప్టర్ కూలి ఇద్దరు మంత్రులు, పైలట్ మృతి
చండీఘర్: ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ సమీపంలోని గంగోహ్ గ్రామం వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో హర్యానా మంత్రులు మరణించినట్లు భావిస్తున్నారు. హర్యానా మంత్రి ఒ.పి. జిందాల్, మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు, మంత్రి సురేందర్ సింగ్ మరణించినట్లు తెలుస్తోంది. పైలట్ చౌహాన్ కూడా మరణించినట్లు సమాచారం. హెలికాప్టర్ జిందాల్ గ్రూప్‌నకు చెందింది.
హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. జిందాల్, సురేంద్రసింగ్‌లతో పాటు హర్యానా శాసనసభ్యుడు గోయల్, పైలట్ పి.యస్. చౌహన్, ఇద్దరు గన్‌మెన్ ప్రయాణిస్తున్నారు. గోయల్‌ను, ఇద్దరు గన్‌మెన్‌ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ హెలికాప్టర్‌ను ఆరు నెలల క్రితం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశారు. చండీఘడ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన అరగంటకే సహరన్‌పూర్ వద్ద దాదాపు పదకొండున్నర గంటల ప్రాంతంలో కూలిపోయింది. సాంకేతిక లోపాల వల్లనే హెలికాప్టర్ కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications
