భూపంపణీ మిష కాకూడదు: బిజెపి
విశాఖపట్నం: భూపంపణీ ప్రధాన సూత్రం కావాలే తప్ప మిష కాకూడదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ అన్నారు. నక్సలైట్ల సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించి భూపంపిణీని చేపడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయంలో విఫలమైందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం డిమాండ్ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. మంత్రివర్గం రెండుగా విడిపోయిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి టి ఆర్‌యస్, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడాలని ఆయన అన్నారు. మంత్రివర్గం విభజన జరగకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు గురించి మాట్లాడే నైతిక హక్కు వారికి లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
