స్త్రీలకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త పారిశ్రామిక విధానం
హైదరాబాద్: మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే కొత్త పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశం ఇది.
పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే మహిళలకు ఐదు సబ్సిడీ ఇవ్వాలని, దళిత మహిళలకు మరో ఐదు శాతం సబ్సిడీ ఇవ్వాలని మంత్రివర్గం ఆమోదించిన పారిశ్రామిక విధానంతో ప్రతిపాదించింది. సాగునీటి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులయ్యేవారికి పునరావాస, పునర్నిర్మాణ కల్పించే పథకాన్ని కూడా మంత్రివర్గం ఆమోదించింది. శాంతిభద్రతలు, కరువు పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల టెండర్లు, మంచినీటి ఎద్దడి నివారణ వంటి అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications
