నక్సల్స్ దాడి: క్షతగాత్రులకు హైదరాబాద్‌లో చికిత్స
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో మావోయిస్టుల దాడిలో గాయపడిన పోలీసు కానిస్టేబుల్ ప్రభాకర్‌కు హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. అచ్చంపేట పోలీసు స్టేషన్‌పై మావోయిస్టు నక్సలైట్లు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో వైర్లెస్ సెట్ ఆపరేటర్ శంకర్ నాయక్ అక్కడికక్కడే మరణించగా, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మయ్య తీవ్రంగా గాయపడిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. మరో కానిస్టేబుల్ ప్రభాకర్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఉప్పునుంతల పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు అచ్చంపేట పోలీసు స్టేషన్ ముందు నించుని మాట్లాడుకుంటుండగా సంచులతో వచ్చిన ఆరుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారని, నిరాయుధంగా ఉన్న కానిస్టేబుళ్లు ఈ సంఘటనతో పరుగులు తీశారని చెబుతున్నారు. ఉప్పనుంతల పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌కు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి హైదరాబాద్‌కు తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. అతను మార్గ మధ్యంలో మరణించాడు. దాదాపు 25 నిమిషాల పాటు కాల్పులు జరిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
