కొనసాగుతున్నచిరుతల వేట

కడప:వన్యప్రాణి సంరక్షణ విషయాన్ని మరిచి కడపజిల్లా రాజంపేట ఫారెస్ట్‌ డివి జన్‌లో చిరుతలపైవేటగాళ్లు దృష్టి సా రించారు. చిట్వేలి రేంజ్‌లోచిరుతను హతమార్చి గోళ్లు, చర్మం అమ్ముకునేప్ర యత్నం వెలుగుచూసిన మరుసటిరోజుగురువారం రాజంపేట రేంజ్‌లోని బావికాడపల్లెసమీపంలో విద్యుదాఘాతానికి మరో చిరుతహతమైన సంఘ టన వెలుగుచూసింది.రాజంపేట డి ఎఫ్‌ఓ సుందర్‌ తన చాంబర్‌లోవిలేక రులకు ఈ సంఘటన వివరాలు వెల్ల డించారు.పుల్లంపేట మండలం బావి కాడపల్లె సమీపఅటవీ ప్రాంతంలోని పచ్చారుమానికుంట వద్దరెండు రోజు ల క్రితం సుమారు రెండున్నరనుంచి మూడు సంవత్సరాల వయస్సు గలమగ చిరుత వేటగాళ్ళు అమర్చిన వి ద్యుత్‌తీగలకు తగులుకుని మృతి చెం దిందన్నారు.బావికాడపల్లె విఎస్‌ఎస్‌ సభ్యులు గురువారంతమకు సమా చారం అందించడంతోసిబ్బందితో వెళ్లి మృతిచెందిన చిరుతనుస్వాధీనం చేసు కున్నామని తెలిపారు. ఎస్‌.ఆర్‌.పాళెంబీట్‌లోని కంపార్ట్‌ నెంబర్‌ 892 ప్రాం తంలో ఈచిరుత మృతి చెందిందన్నా రు. 120 సెంటీమీటర్ల పొడవు గల ఈ చిరుత 60 సెంటీమీటర్లతోక కలిగి ఉం దని, దీనినిబట్టి ఇది రెండున్నర,మూడు సంవత్సరాల మధ్య వయస్సుకలిగి ఉంటుందని తెలిపారు. చిరుత మృతదేహానికిపోస్టుమార్టం నిర్వహిం చి పంచనామా అనంతరంఖననం చేస్తామని తెలిపారు. చిరుతనుహత మార్చిన సంఘ టనపై విచారణ జరిపినిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడంద్వారానే వన్యప్రాణులకు రక్షణకలుగుతుందన్నారు. ఇకపై వన్య ప్రాణి సంరక్షణపై ప్రత్యేక దృష్టిపెడతామనితెలిపారు. రాజంపేట ఫారెస్ట్‌ డివిజన్‌ లో 89 చిరుతపులులు ఉన్నాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+