ఓ సినీ నటి కిడ్నాప్‌కథ
భువనేశ్వర్: కిడ్నాపర్లచెర నుంచి పోలీసులు ఓ సినీ నటిని కాపాడటంఅచ్చం బాలీవుడ్ దృశ్యాలను తలపి స్తోంది.ప్రథమ్ ప్రేమ్ చిత్రం ద్వారా చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన సుజెనా(19)నుగతనెల 18న ప్రకటనల కర్త రాకేష్‌పట్నాయక్ కిడ్నాప్‌చేసి తన వద్దఉంచుకున్నాడని ఆరోపిస్తోందని పోలీసులుతెలిపారు. తన ఇంటివద్ద ఆటోకోసం వేచిఉన్న సమయంలో పట్నాయక్ ముగ్గురుమిత్రులతో కలిసి కారులో వచ్చారని సుజెనాచెప్పిందన్నారు. పట్నాయక్ మామూలుగాతెలిసిన వ్యక్తి అయినందున కారులోదించుతానని అతడు అడగ్గా అందు కు అంగీకరించారనిఆమె చెప్పినట్లు వారు తెలిపారు. అయి తేతన మిత్రురాలి ఇంటికి తీసుకెళ్ళకుండాపట్నాయక్ తన ను వేరే ఇంటికి తీసుకెళ్ళిఅక్కడ తనను ఆధీనంలో ఉంచు కున్నాడనిఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు.తనకు అన్నం పెట్టారని, అది తిన్న తరువాతవేరే రకంగా ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పిందన్నారు.ఆ తరువాత తనను ఓ మ్యారేజి బ్యూరోకితీసుకెళ్ళి కొన్ని పత్రాలమీద సంతకాలు చేయమన్నారని సుజెనా పేర్కొంది. ఆమెతో పట్నాయక్‌ఫోటోలు తీసుకొని వాటిని గత వారం పత్రికలకువిడుదల చేశారు. సుజెనా తల్లిదండ్రులఇష్టానికి భిన్నంగా వీరిద్దరిది ప్రేమ వివాహంగామ్యారేజి బ్యూరో ప్రకటించింది. అయితేతన కూతుర్ని కిడ్నాప్ చేసి ఆమెకు ఇష్టంలేకుండాపట్నాయక్ పెళ్ళి చేసుకున్నాడని గుర్తుతెలియనివ్యక్తి ఒకరు తన బం ధువులకు ఫోన్‌చేశాడని సుజెనా తండ్రి ధరంవీర్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సుజెనాను బందించిన ఇంటి అడ్రెస్ కూడా ఆవ్యక్తి ఇచ్చాడు. దీంతో పోలీసులు గురు వారంఆ ఇంటిపై దాడిచేసి ఆమెను కాపాడి కిడ్నాపర్లకోసంగాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications
