బాలకార్మికులనుపెట్టుకుంటే కఠిన చర్యలు: గవర్నర్
హైదరాబాద్:చిన్నపిల్లలతో పనులు చేయిస్తూ వెట్టిచాకిరికిగురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌సుశీల్‌కుమార్ షిండే అధికారులకు సూచించారు.బాలకార్మికులు విద్యనభ్యసిం చి ఉన్నతశిఖరాలను అధిరోహించాలని అన్నారు. శుక్రవారం పెద్ద అడిశర్లపల్లి మండలం చిల్కమర్రిగ్రామం వద్ద నున్న బాలకార్మిక కేంద్రాన్నిఆయన సందర్శించారు. ఈ సందర్భంగాబాలకార్మికులు తయారుచేసిన టిఎల్‌ఎంఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. అనంతరంగవర్నర్ మా ట్లాడుతూ బాలకార్మికులువిద్యనభ్యసించి విద్యావంతులుగా మారాలనిఆయన అన్నారు. బాలకార్మికులను విద్యావంతులుగాతీర్చిదిద్దడానికి ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తున్నదన్నారు.బాల కార్మికులు శిక్షణ శిబిరంలో చేరి చదువునేర్చుకోవడంపట్ల ఆయన సంతృప్తినివ్యక్తం చేశారు.
చిన్నారులు ఉన్నత విద్యలనభ్యసించి దేశం గర్వించదగ్గ స్థాయిలోఎదగాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కావేటివిజయానంద్, జాయింట్ కలెక్టర్ శ్రీధర్,జెడ్‌పి చైర్‌పర్సన్ కీత లక్ష్మమ్మ,ఎస్‌సి కార్పొరేషన్ ఇడి శ్రీనివాస్ నాయక్‌పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
