ప్రాజెక్టులలో తప్పు జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం: సియం
నిజామాబాద్: సాగునీటి ప్రాజెక్టులలో తప్పులు జరిగితే తాము ఏ శిక్షకైనా సిద్ధమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా గుత్ప ప్రాజెక్టుకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం గుత్ప ఎత్తిపోతల పథకానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హడావిడిగా శంకుస్థాపన రాయి వేసిందని, అది సమాధి రాయిగా మారిందని ఆయన అన్నారు. గుత్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టడానికి గత తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.
తాము మొత్తం 31 సాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నామని, సాంకేతికంగా గానీ ఆర్థికంగా గానీ ఈ ప్రాజెక్టుల విషయంలో ఏవైనా లోపాలు జరిగితే ఏ శిక్షకైనా తాము సిద్ధమని ఆయన అన్నారు. ఈ నెల పదవ తేదీ నుంచి ఒక్కో ప్రాజెక్టుపై ఒక్కో పార్టీతో తాము ఒక్కో వారం బహిరంగ చర్చ జరుపుతామని, సాంకేతిక నిపుణులు ప్రాజెక్టుల గురించి వివరిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
