తెలంగాణపై హైకమాండ్ నిర్ణయం శిరోధార్యం: కెకె
హైదరాబాద్: తెలంగాణపై తమ పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం తమకు శిరోధార్యమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై సోనియా గాంధీకి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, చెప్పాల్సిందంతా చాలా కాలంగా చెబుతూనే వస్తున్నామని ఆయన అన్నారు.
నక్సల్స్ సమస్యపై తాను సోనియా గాంధీతో చర్చించానని, నక్సలైట్లతో చర్చలు జరపాలన్నదే తమ పార్టీ, ప్రభుత్వ అభిప్రాయమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసికెళ్లడానికి పది వేల మంది కార్యకర్తలను గుర్తించనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
