మావోయిస్టు నక్సల్ హతం: ప్రైవేట్ బస్సు దగ్ధం
హైదరాబాద్: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం బావాపురం - లింగాపురం గ్రామాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళ సభ్యుడు శ్రీధర్ హతమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం - పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. లొంగిపోవాల్సిందిగా వారిని పోలీసులు హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నక్సల్స్ గ్రెనేడ్ విసిరి కాల్పులు ప్రారంభించారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో శ్రీధర్ అనే నక్సలైట్ మరణించాడు. సంఘటనా స్థలంలో గ్రెనేడ్, తపంచాలు పడి ఉన్నాయి.
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా గుత్తికొండలో మావోయిస్టులు ఒక ప్రైవేట్ హైటెక్ బస్సును దగ్ధం చేశారు. ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును నక్సల్స్ అపేశారు. ఆ తర్వాత ప్రయాణికులను దింపేసి దగ్ధం చేశారు. తాము ఎంత నచ్చజెప్పినా నక్సల్స్ వినలేదని బస్సు డ్రైవర్ చెప్పాడు.












Click it and Unblock the Notifications
