క్రికెట్: శ్రీలంక జట్టు భారత పర్యటన వాయిదా
ముంబాయి: శ్రీలంక క్రికెట్ జట్టు భారత పర్యటన నిరవధికంగా వాయిదా పడింది. ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడడానికి శ్రీలంక జట్టు భారత పర్యటనకు రావాల్సి ఉంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి శ్రీలంక బోర్డు నుంచి ఏ విధమైన సమాచారం రాకపోవడంతో ఈ నెల 22వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు జరగాల్సిన భారత, శ్రీలంక పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల సిరీస్ రద్దయింది.
శ్రీలంక క్రికెట్ సిరీస్‌ను ఖాయపరుస్తూ సమాచారం అందించడంలో విఫలమైనందున, ఇటీవలి శ్రీలంక క్రికెట్ అధికార యంత్రాంగ పరిణామాల వల్ల ఇరు దేశాలకు అనువైన తేదీలు ఖరారయ్యే వరకు సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు బిసిసిఐ జాయింట్ సెక్రటరీ గౌతమ్ దాస్‌గుప్తా ముంబాయిలో చెప్పారు. ఆర్థిక అవకతవకల అరోపణలతో, మరి కొన్ని ఆరోపణలతో శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాక శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications
