మూడో ఫ్రంట్‌కు అవకాశాలు లేవు: వెంకయ్య
హైదరాబాద్: బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ ( ఆర్జేడీ)ని పక్కన పెడుతూ జెడి (యు) నేత నితీష్ కుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న కృషి ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే ఆ విషయంపై తాము మాట్లాడుతామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్రంలో మూడో ఫ్రంట్ ఏర్పడే అవకాశాలు లేవని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బీహార్‌లో ఆటవిక పాలనను అంతం చేయాలనే ప్రథమ కర్తవ్యంలో తాము సఫలమయ్యామని, రెండో కర్తవ్యంలో సఫలం కావాల్సి ఉన్నదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
