తప్పుకుంటున్నాం:మావోయిస్టు ప్రతినిధులు
హైదరాబాద్: మావోయిస్టు ప్రతినిధుల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు విప్లవ రచయితలు వరవరరావు,కళ్యాణరావు, విప్లవ గాయకుడుగద్దర్ సోమవారం ఇక్కడప్రకటించారు. జనశక్తి ప్రతినిధులు చంద్రన్న, శ్రీనివాస్‌లు ఇంకా తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. చర్చలకుతలుపులు మూసి, ఫాసిస్టు విధానాలనువైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్‌రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందనివరవరరావు విమర్శించారు. దాడులుజరిగితే ఎదురుదాడులు ఉంటాయని మావోయిస్టు పార్టీ మొదటి నుంచి స్పష్టం చేస్తూ వస్తోందని ఆయన అన్నారు.తాము మావోయిస్టు ప్రతినిధులుగావైదొలగినప్పటికీ ప్రజా సమస్యల మీదవివిధ కళారూపాలతో పోరాడుతామనిగద్దర్ చెప్పారు.












Click it and Unblock the Notifications
