నక్సల్స్‌తోఎన్నిసార్లయినా చర్చలకు సిద్ధం:వైఎస్
నిజామాబాద్:నక్సలైట్లతో చర్చలకు ప్రభుత్వంసానుకూలంగా ఉందని, అయితే వారుఆయుధాలను విడనాడాలని ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి అన్నారు. తుపాకులువిడనాడే విషయంలో చర్చలకు రావాలనిఆయన మావోయిస్టులకు సూచించారు.సోమవారం ఆయన రాజీవ్ నగర బాట కార్యక్రమం కోసంనిజామాబాద్‌జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగాఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రెండో సారే కాదు ఇరవైసార్లయినా నక్సలైట్లతో చర్చలుజరపడానికి తాము సిద్ధమని ఆయనఅన్నారు. అయితే ఆయుధాలు పట్టుకునితిరుగుతామంటే ఎవరినీ సహించేదిలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తీవ్రవాదులు ప్రజలకు సంబంధించినసమస్యలను తమ ముందుకు తెస్తేపరిష్కరిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
