వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై వెనక్కి తగ్గలేదు: విజయశాంతి
న్యూఢిల్లీ: తెలంగాణ విషయం తాను వెనక్కి తగ్గేది లేదని తెలుగు సినీ నటి, భారతీయ జనతా మహిళా మోర్చా నాయకురాలు విజయశాంతి స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకేసారి బిజెపికి పాతికేళ్ల నిండటం, తన సినీ జీవితానికి పాతికేళ్లు నిండడం ఆనందంగా ఉన్నదని ఆమె అన్నారు.
తెలంగాణపై ఏం చేయాలనేది పార్టీ సమావేశంలో చర్చిస్తామని ఆమె చెప్పారు. పార్టీని తిరిగి అధికారంలోకి తేవడానికి కఠిన శ్రమ చేయాలనేది నాయకుల అభిమతమని ఆమె అన్నారు. హీరోయిన్గా పాతికేళ్లు పూర్తి చేయాలనే తన లక్ష్యం నెరవేరిందని, ఇంతకాలం సినిమాలో హీరోయిన్గా కొనసాగడం అంత సులభం కాదని, అందుకు ఓర్పు, అంకితభావం, త్యాగం కావాలని ఆమె అన్నారు. తాను త్వరలోనే హైదరాబాద్కు తన మకాం మార్చి పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని ఆమె చెప్పారు.
Comments
Story first published: Tuesday, April 5, 2005, 23:53 [IST]